WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాల్లోకి వెళ్ల౦డి

శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం

 

శ్రీం సౌం శరవణభవః శరచ్చంద్రాయుతప్రభః |

శశాంకశేఖరసుతః శచీమాంగళ్యరక్షకః || ౧ ||


శతాయుష్యప్రదాతా చ శతకోటిరవిప్రభః |

శచీవల్లభసుప్రీతః శచీనాయకపూజితః || ౨ ||


శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివందితః |

శచీశార్తిహరశ్చైవ శంభుః శంభూపదేశకః || ౩ ||


శంకరః శంకరప్రీతః శమ్యాకకుసుమప్రియః |

శంకుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివందితః || ౪ ||


శచీనాథసుతాప్రాణనాయకః శక్తిపాణిమాన్ |

శంఖపాణిప్రియః శంఖోపమషడ్గలసుప్రభః || ౫ ||


శంఖఘోషప్రియః శంఖచక్రశూలాదికాయుధః |

శంఖధారాభిషేకాదిప్రియః శంకరవల్లభః || ౬ ||


శబ్దబ్రహ్మమయశ్చైవ శబ్దమూలాంతరాత్మకః |

శబ్దప్రియః శబ్దరూపః శబ్దానందః శచీస్తుతః || ౭ ||


శతకోటిప్రవిస్తారయోజనాయతమందిరః |

శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితః || ౮ ||


శతకోటిమహర్షీంద్రసేవితోభయపార్శ్వభూః |

శతకోటిసురస్త్రీణాం నృత్తసంగీతకౌతుకః || ౯ ||


శతకోటీంద్రదిక్పాలహస్తచామరసేవితః |

శతకోట్యఖిలాండాదిమహాబ్రహ్మాండనాయకః || ౧౦ ||


శంఖపాణివిధిభ్యాం చ పార్శ్వయోరుపసేవితః |

శంఖపద్మనిధీనాం చ కోటిభిః పరిసేవితః || ౧౧ ||


శశాంకాదిత్యకోటీభిః సవ్యదక్షిణసేవితః |

శంఖపాలాద్యష్టనాగకోటీభిః పరిసేవితః || ౧౨ ||


శశాంకారపతంగాదిగ్రహనక్షత్రసేవితః |

శశిభాస్కరభౌమాదిగ్రహదోషార్తిభంజనః || ౧౩ ||


శతపత్రద్వయకరః శతపత్రార్చనప్రియః |

శతపత్రసమాసీనః శతపత్రాసనస్తుతః || ౧౪ ||


శారీరబ్రహ్మమూలాదిషడాధారనివాసకః |

శతపత్రసముత్పన్నబ్రహ్మగర్వవిభేదనః || ౧౫ ||


శశాంకార్ధజటాజూటః శరణాగతవత్సలః |

రకారరూపో రమణో రాజీవాక్షో రహోగతః || ౧౬ ||


రతీశకోటిసౌందర్యో రవికోట్యుదయప్రభః |

రాగస్వరూపో రాగఘ్నో రక్తాబ్జప్రియ ఏవ చ || ౧౭ ||


రాజరాజేశ్వరీపుత్రో రాజేంద్రవిభవప్రదః |

రత్నప్రభాకిరీటాగ్రో రవిచంద్రాగ్నిలోచనః || ౧౮ ||


రత్నాంగదమహాబాహూ రత్నతాటంకభూషణః |

రత్నకేయూరభూషాఢ్యో రత్నహారవిరాజితః || ౧౯ ||


రత్నకింకిణికాంచ్యాదిబద్ధసత్కటిశోభితః |

రవసంయుక్తరత్నాభనూపురాంఘ్రిసరోరుహః || ౨౦ ||


రత్నకంకణచూల్యాదిసర్వాభరణభూషితః |

రత్నసింహాసనాసీనో రత్నశోభితమందిరః || ౨౧ ||


రాకేందుముఖషట్కశ్చ రమావాణ్యాదిపూజితః |

రాక్షసామరగంధర్వకోటికోట్యభివందితః || ౨౨ ||


రణరంగే మహాదైత్యసంగ్రామజయకౌతుకః |

రాక్షసానీకసంహారకోపావిష్టాయుధాన్వితః || ౨౩ ||


రాక్షసాంగసముత్పన్నరక్తపానప్రియాయుధః |

రవయుక్తధనుర్హస్తో రత్నకుక్కుటధారణః || ౨౪ ||


రణరంగజయో రామాస్తోత్రశ్రవణకౌతుకః |

రంభాఘృతాచీవిశ్వాచీమేనకాద్యభివందితః || ౨౫ ||


రక్తపీతాంబరధరో రక్తగంధానులేపనః |

రక్తద్వాదశపద్మాక్షో రక్తమాల్యవిభూషితః || ౨౬ ||


రవిప్రియో రావణేశస్తోత్రసామమనోహరః |

రాజ్యప్రదో రంధ్రగుహ్యో రతివల్లభసుప్రియః || ౨౭ ||


రణానుబంధనిర్ముక్తో రాక్షసానీకనాశకః |

రాజీవసంభవద్వేషీ రాజీవాసనపూజితః || ౨౮ ||


రమణీయమహాచిత్రమయూరారూఢసుందరః |

రమానాథస్తుతో రామో రకారాకర్షణక్రియః || ౨౯ ||


వకారరూపో వరదో వజ్రశక్త్యభయాన్వితః |

వామదేవాదిసంపూజ్యో వజ్రపాణిమనోహరః || ౩౦ ||


వాణీస్తుతో వాసవేశో వల్లీకల్యాణసుందరః |

వల్లీవదనపద్మార్కో వల్లీనేత్రోత్పలోడుపః || ౩౧ ||


వల్లీద్వినయనానందో వల్లీచిత్తతటామృతమ్ |

వల్లీకల్పలతావృక్షో వల్లీప్రియమనోహరః || ౩౨ ||


వల్లీకుముదహాస్యేందుః వల్లీభాషితసుప్రియః |

వల్లీమనోహృత్సౌందర్యో వల్లీవిద్యుల్లతాఘనః || ౩౩ ||


వల్లీమంగళవేషాఢ్యో వల్లీముఖవశంకరః |

వల్లీకుచగిరిద్వంద్వకుంకుమాంకితవక్షకః || ౩౪ ||


వల్లీశో వల్లభో వాయుసారథిర్వరుణస్తుతః |

వక్రతుండానుజో వత్సో వత్సలో వత్సరక్షకః || ౩౫ ||


వత్సప్రియో వత్సనాథో వత్సవీరగణావృతః |

వారణాననదైత్యఘ్నో వాతాపిఘ్నోపదేశకః || ౩౬ ||


వర్ణగాత్రమయూరస్థో వర్ణరూపో వరప్రభుః |

వర్ణస్థో వారణారూఢో వజ్రశక్త్యాయుధప్రియః || ౩౭ ||


వామాంగో వామనయనో వచద్భూర్వామనప్రియః |

వరవేషధరో వామో వాచస్పతిసమర్చితః || ౩౮ ||


వసిష్ఠాదిమునిశ్రేష్ఠవందితో వందనప్రియః |

వకారనృపదేవస్త్రీచోరభూతారిమోహనః || ౩౯ ||


ణకారరూపో నాదాంతో నారదాదిమునిస్తుతః |

ణకారపీఠమధ్యస్థో నగభేదీ నగేశ్వరః || ౪౦ ||


ణకారనాదసంతుష్టో నాగాశనరథస్థితః |

ణకారజపసుప్రీతో నానావేషో నగప్రియః || ౪౧ ||


ణకారబిందునిలయో నవగ్రహసురూపకః |

ణకారపఠనానందో నందికేశ్వరవందితః || ౪౨ ||


ణకారఘంటానినదో నారాయణమనోహరః |

ణకారనాదశ్రవణో నలినోద్భవశిక్షకః || ౪౩ ||


ణకారపంకజాదిత్యో నవవీరాధినాయకః |

ణకారపుష్పభ్రమరో నవరత్నవిభూషణః || ౪౪ ||


ణకారానర్ఘశయనో నవశక్తిసమావృతః |

ణకారవృక్షకుసుమో నాట్యసంగీతసుప్రియః || ౪౫ ||


ణకారబిందునాదజ్ఞో నయజ్ఞో నయనోద్భవః |

ణకారపర్వతేంద్రాగ్రసముత్పన్నసుధారణిః || ౪౬ ||


ణకారపేటకమణిర్నాగపర్వతమందిరః |

ణకారకరుణానందో నాదాత్మా నాగభూషణః || ౪౭ ||


ణకారకింకిణీభూషో నయనాదృశ్యదర్శనః |

ణకారవృషభావాసో నామపారాయణప్రియః || ౪౮ ||


ణకారకమలారూఢో నామానంతసమన్వితః |

ణకారతురగారూఢో నవరత్నాదిదాయకః || ౪౯ ||


ణకారమకుటజ్వాలామణిర్నవనిధిప్రదః |

ణకారమూలమంత్రార్థో నవసిద్ధాదిపూజితః || ౫౦ ||


ణకారమూలనాదాంతో ణకారస్తంభనక్రియః |

భకారరూపో భక్తార్థో భవో భర్గో భయాపహః || ౫౧ ||


భక్తప్రియో భక్తవంద్యో భగవాన్భక్తవత్సలః |

భక్తార్తిభంజనో భద్రో భక్తసౌభాగ్యదాయకః || ౫౨ ||


భక్తమంగళదాతా చ భక్తకళ్యాణదర్శనః |

భక్తదర్శనసంతుష్టో భక్తసంఘసుపూజితః || ౫౩ ||


భక్తస్తోత్రప్రియానందో భక్తాభీష్టప్రదాయకః |

భక్తసంపూర్ణఫలదో భక్తసామ్రాజ్యభోగదః || ౫౪ ||


భక్తసాలోక్యసామీప్యరూపమోక్షవరప్రదః |

భవౌషధిర్భవఘ్నశ్చ భవారణ్యదవానలః || ౫౫ ||


భవాంధకారమార్తాండో భవవైద్యో భవాయుధమ్ |

భవశైలమహావజ్రో భవసాగరనావికః || ౫౬ ||


భవమృత్యుభయధ్వంసీ భావనాతీతవిగ్రహః |

భవభూతపిశాచఘ్నో భాస్వరో భారతీప్రియః || ౫౭ || [భయ]


భాషితధ్వనిమూలాంతో భావాభావవివర్జితః |

భానుకోపపితృధ్వంసీ భారతీశోపదేశకః || ౫౮ ||


భార్గవీనాయకశ్రీమద్భాగినేయో భవోద్భవః |

భారక్రౌంచాసురద్వేషో భార్గవీనాథవల్లభః || ౫౯ ||


భటవీరనమస్కృత్యో భటవీరసమావృతః |

భటతారాగణోడ్వీశో భటవీరగణస్తుతః || ౬౦ ||


భాగీరథేయో భాషార్థో భావనాశబరీప్రియః |

భకారే కలిచోరారిభూతాద్యుచ్చాటనోద్యతః || ౬౧ ||


వకారసుకలాసంస్థో వరిష్ఠో వసుదాయకః |

వకారకుముదేందుశ్చ వకారాబ్ధిసుధామయః || ౬౨ ||


వకారామృతమాధుర్యో వకారామృతదాయకః |

దక్షే వజ్రాభీతియుతో వామే శక్తివరాన్వితః || ౬౩ ||


వకారోదధిపూర్ణేందుః వకారోదధిమౌక్తికమ్ |

వకారమేఘసలిలో వాసవాత్మజరక్షకః || ౬౪ ||


వకారఫలసారజ్ఞో వకారకలశామృతమ్ |

వకారపంకజరసో వసుర్వంశవివర్ధనః || ౬౫ ||


వకారదివ్యకమలభ్రమరో వాయువందితః |

వకారశశిసంకాశో వజ్రపాణిసుతాప్రియః || ౬౬ ||


వకారపుష్పసద్గంధో వకారతటపంకజమ్ |

వకారభ్రమరధ్వానో వయస్తేజోబలప్రదః || ౬౭ ||


వకారవనితానాథో వశ్యాద్యష్టప్రియాప్రదః |

వకారఫలసత్కారో వకారాజ్యహుతాశనః || ౬౮ ||


వర్చస్వీ వాఙ్మనోఽతీతో వాతాప్యరికృతప్రియః |

వకారవటమూలస్థో వకారజలధేస్తటః || ౬౯ ||


వకారగంగావేగాబ్ధిః వజ్రమాణిక్యభూషణః |

వాతరోగహరో వాణీగీతశ్రవణకౌతుకః || ౭౦ ||


వకారమకరారూఢో వకారజలధేః పతిః |

వకారామలమంత్రార్థో వకారగృహమంగళమ్ || ౭౧ ||


వకారస్వర్గమాహేంద్రో వకారారణ్యవారణః |

వకారపంజరశుకో వలారితనయాస్తుతః || ౭౨ ||


వకారమంత్రమలయసానుమన్మందమారుతః |

వాద్యంతభాంత షట్క్రమ్య జపాంతే శత్రుభంజనః || ౭౩ ||


వజ్రహస్తసుతావల్లీవామదక్షిణసేవితః |

వకులోత్పలకాదంబపుష్పదామస్వలంకృతః || ౭౪ ||


వజ్రశక్త్యాదిసంపన్నద్విషట్పాణిసరోరుహః |

వాసనాగంధలిప్తాంగో వషట్కారో వశీకరః || ౭౫ ||


వాసనాయుక్తతాంబూలపూరితాననసుందరః |

వల్లభానాథసుప్రీతో వరపూర్ణామృతోదధిః || ౭౬ ||


ఇతి శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రమ్ |