పల్లవి
అంబా నీకిదే హారతి శ్రీ రాజ రాజేశ్వరి
అంబా నీకిదే హారతి శ్రీ రాజ రాజేశ్వరి
అంబా నీకిదే హారతి శ్రీ రాజ రాజేశ్వరి
చ. 1. పరమ భక్తులు నిన్ను భజియించు చున్నారు
పరమ భక్తులు నిన్ను భజియించు చున్నారు
పరిపాలించీ బ్రోవవే శ్రీ జగదీశ్వరి పరిపాలించీ బ్రోవవే శ్రీ జగదీశ్వరి
అంబా నీకిదే హారతి శ్రీ రాజ రాజేశ్వరి
చ. 2. నీ పాదములు నమ్మి నిను కొలుచూ చున్నాము
నీ పాదములు నమ్మి నిను కొలుచూ చున్నాము
కాపాడి రక్షించవే కనికరములతో... కాపాడి రక్షించవే కనికరములతో...
అంబా నీకిదే హారతి శ్రీ రాజ రాజేశ్వరి
చ.3. ముగ్గురమ్మలకును మూలము నీవేనమ్మా
ముగ్గురమ్మలకును మూలము నీవేనమ్మా
ఎగ్గులెన్నకు మాయందు నేరనివారము ఎగ్గులెన్నకు మాయందు నేరనివారము
పల్లవి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ
శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||
పల్లవి
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
చ.1 జలజాక్షి మోమునకు జక్కవకుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం..... నీరాజనం.....
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
చ 2. చరణ కిసలయములకు సఖియరంభోరులకు చరణ కిసలయములకు సఖియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
చరణ కిస లయములకు సఖియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం... నీరాజనం.....
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
చ.3. పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం..... నీరాజనం......
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం..... నీరాజనం......
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
పల్లవి
ఓం జయ జగదీశ హరే స్వామి
జయ జగదీశ హరే
భక్త జనోఁ కే సంకట దాస జనోఁ కే సంకట
క్షణ మే దూర్ కరే ఓం జయ జగదీశ హరే ||
జో ధ్యావే ఫల్ పావే
దుఖ్ బినసే మన్ కా స్వామి
దుఖ్ బినసే మన్ కా సుఖ సంపతి ఘర్ ఆవే
సుఖ సంపతి ఘర్ ఆవే
కష్ట మిటే తన్ కా ఓం జయ జగదీశ హరే ||
మాత పితా తుమ మేరే
శరణ గహూఁ కిసకీ స్వామి
శరణ గహూఁ కిసకీ
తుమ్ బిన ఔర న దూజా
తుమ్ బిన ఔర న దూజా
ఆస్ కరూఁ జిసకి ఓం జయ జగదీశ హరే ||
తుమ్ పూరణ పరమాత్మా
తుమ్ అంతరయామి స్వామి
తుమ్ అంతరయామి
పారబ్రహ్మ పరమేశ్వర
పారబ్రహ్మ పరమేశ్వర
తుమ్ సబ్ కే స్వామీ ఓం జయ జగదీశ హరే ||
తుమ్ కరుణా కే సాగర్
తుమ్ పాలనకర్తా స్వామి
తుమ్ పాలనకర్తా
మైఁ మూరఖ్ ఖల్ కామి
మైఁ సేవక్ తుమ్ స్వామి
కృపా కరో భర్తా ఓం జయ జగదీశ హరే ||
తుమ్ హో ఏక్ అగోచర్
సబ్ కే ప్రాణపతి స్వామి
సబ్ కే ప్రాణపతి
కిస్ విధి మిలూఁ దయామయ
కిస్ విధి మిలూఁ దయామయ
తుమ్ కో మైఁ కుమతి ఓం జయ జగదీశ హరే ||
దీనబంధు దుఖహర్తా
ఠాకుర్ తుమ మేరే స్వామి
రక్షక్ తుమ మేరే అప్నే హాథ్ ఉఠావో
అప్నే శరణ లగావో
ద్వార్ పడా తేరే ఓం జయ జగదీశ హరే ||
విషయ వికార మిటావో
పాప హరో దేవా స్వామి
పాప హరో దేవా
శ్రద్ధా భక్తి బఢావో
శ్రద్ధా భక్తి బఢావో
సంతన్ కీ సేవా ఓం జయ జగదీశ హరే ||
తన్ మన్ ధన్ సబ్ తేరా
సబ్ కుచ్ హై తేరా స్వామి
సబ్ కుచ్ హై తేరా
తేరా తుజ్ కో అర్పణ్
తేరా తుజ్ కో అర్పణ్
క్యా లాగే మేరా ఓం జయ జగదీశ హరే ||
ఓం జయ జగదీశ హరే స్వామి
జయ జగదీశ హరే
భక్త జనోఁ కే సంకట దాస జనోఁ కే సంకట
క్షణ మే దూర్ కరే ఓం జయ జగదీశ హరే ||
పల్లవి
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం ||
శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం ||
వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||
బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం ||
గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ||
పల్లవి
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం
శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం
శ్యామలాంగుని కరమునందలి మధుర మురళీకి మంగళం
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం
వనజగోబును ధిక్కరించెడి వదన శోభకు మంగళం
కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం
బ్రహ్మచే పూజింపబడిన చరణయుగళకి మంగళం
జగములన్నియు కన్న తండ్రికి చక్కనయ్యకు మంగళం
గోపికా జన సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం
రాధిక పరివేష్టితుడగు రాధేశ్వరునకు మంగళం