WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాల్లోకి వెళ్ల౦డి

శ్రీ సుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రం

 

శరవణభవ గుహ శరవణభవ గుహ

శరవణభవ గుహ పాహి గురో గుహ ||


అఖిలజగజ్జనిపాలననిలయన

కారణ సత్సుఖచిద్ఘన భో గుహ || ౧ ||


ఆగమనిగదితమంగళగుణగణ

ఆదిపురుషపురుహూత సుపూజిత || ౨ ||


ఇభవదనానుజ శుభసముదయయుత

విభవకరంబిత విభుపదజృంభిత || ౩ ||


ఈతిభయాపహ నీతినయావహ

గీతికలాఖిలరీతివిశారద || ౪ ||


ఉపపతిరివకృతవల్లీసంగమ –

కుపిత వనేచరపతిహృదయంగమ || ౫ ||


ఊర్జితశాసనమార్జితభూషణ

స్ఫూర్జథుఘోషణ ధూర్జటితోషణ || ౬ ||


ఋషిగణవిగణితచరణకమలయుత

ఋజుసరణిచరిత మహదవనమహిత || ౭ ||


ౠకారాక్షరరూప పురాతన

రాకాచంద్రనికాశ షడానన || ౮ ||


ఌకారరూపోపకారసునిరత

వికారరహితాపకారసువిరత || ౯ ||


ౡకారాకృతి శోకాపోహన

కేకారవయుత కేకివినోదన || ౧౦ ||


ఏడకవాహన మూఢవిమోహన

ఊఢసమభువన సోఢసదకరణ || ౧౧ ||


ఐలబిలాదిదిగీశబలావృత

కైలాసాచలలీలాలాలస || ౧౨ ||


ఓజోరేజిత తేజోరాజిత

ఆజివిరాజదరాత్యపరాజిత || ౧౩ ||


ఔపనిషదపరమాత్మపదోదిత

ఔపాధికవిగ్రహతాముపగత || ౧౪ ||


అంహోనాశన రంహోగాహన

బ్రహ్మోద్బోధన సింహోన్మేషణ || ౧౫ ||


అస్తవిశస్తసమస్తమహాసుర

హస్తసతతధృతశక్తిభృతామర || ౧౬ ||


కరుణావిగ్రహ కలితానుగ్రహ

కటుసుతిదుర్గ్రహ పటుయతిసుగ్రహ || ౧౭ ||


ఖండితచండమహాసురమండల-

మండితనిబిడశ్యామళకుంతల || ౧౮ ||


గంగాసంభవ గిరిశతనూభవ

రంగపురోభవ తుంగకుచాధవ || ౧౯ ||


ఘనవాహనముఖ సురవరవందిత

ఘననాదోదిత శిఖినటనందిత || ౨౦ ||


ఙవమానధనుర్మౌర్వీరవరత

పవమానధృతవ్యజనకృతిముదిత || ౨౧ ||


చరణాయుధధర కరణావృతిహర

తరుణాకృతివర కరుణాసాగర || ౨౨ ||


ఛేదిత తారక భేదిత పాతక

ఖేదిత ఘాతక వాంఛితదాయక || ౨౩ ||


జలజనిభనయన ఖలమనుజమథన

బలిదనుజమదన కలికలుషశమన || ౨౪ ||


ఝషకేతనసమ వృషకేతనరమ

మిషచేతనయమ వృషకారిసుగమ || ౨౫ ||


జ్ఞాతాగమచయ ధూతాఘనిచయ

వీతషడరిరయ గీతగుణోదయ || ౨౬ ||


టంకారాగత కంకాత్తాహిత

ఝంకారాఢ్యాలంకారావృత || ౨౭ ||


ఠాకృతిరాజిత హాటకకుండల

స్వాకృతిరేజిత ఘోటకమండల || ౨౮ ||


డింభాకృతియుత రంభానటరత

జంభారివినుత కుంభోద్భవనుత || ౨౯ ||


ఢక్కారవకృత ధిక్కారాహిత

దిక్కాలామిత హిక్కాదిరహిత || ౩౦ ||


ణకారతరుసుమ నికారరతిదమ

ణకారయుతమనుజపవిహితాగమ || ౩౧ ||


తాపత్రయహర కాలత్రయచర

లోకత్రయధర వర్గత్రయకర || ౩౨ ||


స్థిరపదదాయక సురవరనాయక

నిరసితసాయక నిరుపమగాయక || ౩౩ ||


దాంతదయాపర కాంతకళేబర

భ్రాంతం మాం తర శాంతహృదయవర || ౩౪ ||


ధీరోదాత్త గుణోత్తర జిత్వర |

ధీరోపాసిత విత్తమహత్తర || ౩౫ ||


నవవీరాహిత సవయోవిహసిత

భవరోగావృతమనుజజిహాసిత || ౩౬ ||


పుష్కరమాలావాసితవిగ్రహ

పుణ్యపరాయణ విహితపరిగ్రహ || ౩౭ ||


ఫాలలసన్మృగమదతిలకోజ్జ్వల

కలిమలతూల సువాతూలాతుల || ౩౮ ||


బందీకృతసురబృందానందన

వందారు మనుజ మందారద్రుమ || ౩౯ ||


భవతాగమితః కారాగారం

ప్రణవావిదితశ్చతురాస్యోరమ్ || ౪౦ ||


మహనీయమహావాక్యోద్ఘోషిత

కమనీయమహామకుటోద్భూషిత || ౪౧ ||


యోగిహృదయసరసీరుహభాస్వర

యోగాధీశ్వర భోగవికస్వర || ౪౨ ||


రక్షోశిక్షణకృత్యవిచక్షణ

రక్షణదక్షకటాక్షనిరీక్షణ || ౪౩ ||


లోలదుకూలాంచలవాదాంచల

బాలకుతూహల లీలాపేశల || ౪౪ ||


వలవైరిసుతాచరితాపహసిత

లవలీతిమతా భవతో వనితా || ౪౫ ||


శూలాయుధధర కాలాయుతహర

మాలాయుతభర హేలాయుతకర || ౪౬ ||


షట్కోణస్థిత షట్తారకసుత

షడ్భావరహిత షడూర్మిఘాతక || ౪౭ ||


సుబ్రహ్మణ్యోమితి నిగమాంతో

వదతి భవంతం ప్రణవపదార్థమ్ || ౪౮ ||


హారావళియుతకారాహృతసుర

ధారారతహయ నియుత నియుతరథ || ౪౯ ||


లళితకరకమల లుళితవరవలయ

దళితాసురచయ మిళితామరచయ || ౫౦ ||


క్షణభంగురజగదుపపాదనచణ

వేదవినిశ్చిత తత్త్వజనావన || ౫౧ ||


నీలకంఠకృత వర్ణమాలికా

ప్రీతయే భవతు పార్వతీభువః ||


ఇతి నీలకంఠకృత శ్రీసుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రమ్ |