WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాల్లోకి వెళ్ల౦డి

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)

 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో |

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ ||


అర్థం – హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


దేవాదిదేవసుత దేవగణాధినాథ [నుత]

దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |

దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ ||


అర్థం – దేవాదిదేవుని (శివుడి) సుతుడా, దేవగణములకు అధిపతీ, దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మములవంటి పాదములు కలవాడా, దేవ ఋషి అయిన నారద మునీంద్రునిచే సంకీర్తనము చేయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్

తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ | [భాగ్య]

శ్రుత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ ||


అర్థం – నిత్యము అన్నదానము చేయువాడా, అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా, తద్వారా భక్తులకోరికలను తీర్చువాడా, శ్రుతులు (వేదములు), ఆగమములయందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


క్రౌంచాసురేంద్రపరిఖండనశక్తిశూల-

-పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | [చాపాది]

శ్రీకుండలీశధరతుండశిఖీంద్రవాహ

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ ||


అర్థం – అసురుల రాజును ఖండించిన శక్తిశూలం, పాశము మొదలయిన శస్త్రములతో అలంకరింపబడిన చేతులుకలిగి, శ్రీకుండలములు ధరించిన నాయకుడా, శిఖీంద్ర (నెమలి) చే మోయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


దేవాదిదేవ రథమండలమధ్యవేద్య

దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్ |

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౫ ||


అర్థం – దేవాదిదేవా, రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండువాడా, దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని, శూరత్వము కలిగి, సురకోటిచే ప్రశంసింపబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


హీరాదిరత్నమణియుక్తకిరీటహార [హారాది]

కేయూరకుండలలసత్కవచాభిరామమ్ |

హే వీర తారక జయాఽమరబృందవంద్య

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౬ ||


అర్థం – వజ్రము మొదలగు రత్నములతో, మాణిక్యములతో చేయబడిన కిరీటము, హారములు, కేయూరములు, కుండలములు మరియు కవచముతో అందముగా అలంకరింపబడి, వీర తారకుడిని జయించి, దేవతా బృందముచే వందనము చేయబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


పంచాక్షరాదిమనుమంత్రితగాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౭ ||


అర్థం – పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలములతో, పంచామృతములతో, ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా

కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |

సిక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౮ ||


అర్థం – శ్రీకార్తికేయా, కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో, కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును, నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి, ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.


సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః || ౯ ||


అర్థం – సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది. దీనిని యే ద్విజులు పఠించెదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు.


సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || ౧౦ ||


అర్థం – ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించెదరో, వారి కోటిజన్మలలో చేసిన పాపము తక్షణం నశించును.


ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ |