WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ గణపతి తాళం

 

వికటోత్కటసుందరదంతిముఖం

భుజగేంద్రసుసర్పగదాభరణమ్ |

గజనీలగజేంద్ర గణాధిపతిం

ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ || ౧ ||


సుర సుర గణపతి సుందరకేశం

ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ |

భవ భవ గణపతి పద్మశరీరం

జయ జయ గణపతి దివ్యనమస్తే || ౨ ||


గజముఖవక్త్రం గిరిజాపుత్రం

గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ || ౩ ||


కరధృతపరశుం కంకణపాణిం

కబలితపద్మరుచిమ్ |

సురపతివంద్యం సుందరనృత్తం

సురచితమణిమకుటమ్ || ౪ ||


ప్రణమత దేవం ప్రకటిత తాళం

షడ్గిరి తాళమిదమ్ |

తత్తత్ షడ్గిరి తాళమిదం

తత్తత్ షడ్గిరి తాళమిదమ్ || ౫ ||


లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరమ్ |

శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ || ౬ ||


నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్

నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్

నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ || ౭ ||


ధవళిత జలధరధవళిత చంద్రం

ఫణిమణికిరణవిభూషిత ఖడ్గమ్ |

తనుతనువిషహర శూలకపాలం

హర హర శివ శివ గణపతిమభయమ్ || ౮ ||


కటతట విగలితమదజల జలధిత-

గణపతివాద్యమిదం

కటతట విగలితమదజల జలధిత-

గణపతివాద్యమిదం

తత్తత్ గణపతివాద్యమిదం

తత్తత్ గణపతివాద్యమిదమ్ || ౯ ||


తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది

కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది

తత్త ఝం ఝం తరిత

త ఝం ఝం తరిత

తకత ఝం ఝం తరిత

త ఝం ఝం తరిత

తరిదణత దణజణుత జణుదిమిత

కిటతక తరికిటతోం

తకిట కిటతక తరికిటతోం

తకిట కిటతక తరికిటతోం తామ్ || ౧౦ ||


తకతకిట తకతకిట తకతకిట తత్తోం

శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ |

తకతకిట తకతకిట తకతకిట తత్తోం

విమలశుభకమలజలపాదుకం పాణినమ్ |


ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం

ప్రమథగణగుణకథితశోభనం శోభితమ్ |

ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం

పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ |


తకతకిట తకతకిట తకతకిట తత్తోం

పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ |

ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం

ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ |

గణపతి తాళనం గణపతి తాళనమ్ || ౧౧ ||