








ఏతావంతం సమయం
సర్వాపద్భ్యోఽపి రక్షణం కృత్వా |
దేశస్య పరమిదానీం
తాటస్థ్యం కేన వహసి దుర్గాంబ || ౧ ||
అర్థం – ఇప్పటి వరకు దేశమును అన్ని ఆపదల నుంచి కాపాడావు. ఓ దుర్గాంబా, ఇప్పుడు నువ్వు ఏమీ పట్టించుకోనట్టుగా ఉన్నావు.
అపరాధా బహుశః ఖలు
పుత్రాణాం ప్రతిid భవంత్యేవ |
కో వా సహతే లోకే
సర్వాంస్తాన్మాతరం విహాయైకామ్ || ౨ ||
అర్థం – పిల్లలు అడుగడుగునా చాలా తప్పటడుగులు వేస్తారు. ఈ లోకంలో వారిని కన్నతల్లి కాకుండా అవన్నీ ఇంకెవరు సహించగలరు?
మా భజ మా భజ దుర్గే
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు |
కే వా గృహ్ణంతి సుతాన్
మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే || ౩ ||
అర్థం – అలాంటి కన్నతల్లులు కూడా వదిలేసిన దీనావస్థలో ఉన్న పిల్లలను, ఓ దుర్గమ్మా, నీవు కూడా పట్టించుకోకుండా ఉంటే ఇంకెవరు రక్షిస్తారు?
ఇతః పరం వా జగదంబ జాతు
దేశస్య రోగప్రముఖాపదోఽస్య |
న స్యుస్తథా కుర్వచలాం కృపాం
ఇత్యభ్యర్థనాం మే సఫలీకురుష్వ || ౪ ||
అర్థం – కాబట్టి, ఓ జగదంబా (లోకాన్ని కన్నతల్లీ), ఈ రోగంతో దేశానికి వచ్చిన ముఖ్యమైన ఆపదను తొలగించు. నీ కరుణను స్థిరముగా చూపుము. నా ఈ అభ్యర్థనను (కోరిక) సఫలము చేయి.
పాపహీనజనతావనదక్షాః
సంతి నిర్జరవరా న కియంతః |
పాపపూర్ణజనరక్షణదక్షాం
త్వాం వినా భువి పరాం న విలోకే || ౫ ||
అర్థం – ఏటువంటి పాపము లేకుండా, నశించిపోకుండా, జనులను రక్షించేవారు (దేవతలు) ఎవరైనా ఉన్నరా? ఓ దుర్గమ్మా, నువ్వు తప్ప పాపము చేసిన జనులను కూడా రక్షించగల సమర్థత ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదు. కాబట్టి రక్షించు.
ఇతి శృంగేరీ జగద్గురు విరచితం శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం ||

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.