WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ బాలా స్తోత్రం – 2

 

ఐశ్వర్యం మనసేప్సితం మృదువచో గాంభీర్యమత్యున్నతిం

శిష్టాచార విహార పాలన మథో వేదోక్తమాయుః శ్రియమ్ |

మేధావృద్ధిమపత్యదారజసుఖం వైరాగ్యమత్యున్నతం

నిత్యం త్వచ్చరణారవిందభజనే భక్తిం దృఢాం దేహి మే || ౧ ||

 

క్లీం త్వం కామశరాజితే కరశుకీసల్లాపసమ్మోహితే

సౌందర్యాంబుధిమంథనోద్భవకలానాథాననే భామిని |

కోకాకార కుచాగ్రసీమవిలసద్వీణానుగానోద్యతే

త్వత్పాదాంబుజసేవయా ఖలు శివే సర్వాం సమృద్ధిం భజే || ౨ ||

 

సౌమ్యే పావని పద్మసంభవసఖీం కర్పూరచంద్రప్రభాం

శుద్ధస్ఫాటికవిద్రుమగ్రథితసద్రత్నాఢ్యమాలాధరామ్ |

ధర్త్రీం పుస్తకమిష్టదానమభయం శుక్లాక్షమాలాం కరైః

యస్త్వాం ధ్యాయతి చక్రరాజసదనే సంయాతి విద్యాం గురోః || ౩ ||

 

ఇతి శ్రీ బాలా స్తోత్రమ్ |